వానాకాలంలో రైతులు మంచి లాభాలు, మార్కెటింగ్ అవకా శాలు ఉన్న సన్నరకం వరి సాగు వైపు దృష్టి సారిస్తే మేలు. ఆరు రకాల సన్నరకం సీడ్‌ను ఆయా రీసెర్చ్ సెంటర్లలో తయారు చేశారు. ప్రస్తుతం అక్కడ మేళాలు కూడా జరుగుతున్నాయి. రైతులు నేరుగా వెళ్లి తెచ్చుకోవచ్చు. లేని పక్షంలో మండల ఏఓలను సంప్రదిస్తే ఎక్కడ దొరుకుతుందనే వివరాలను చెబుతారు. రెండు మూడు రోజుల్లో ఎరువుల దుకాణాల్లో సైతం అందుబాటులో ఉంటాయి.
– అంబికాసోని,
జిల్లా వ్యవసాయాధికారి


