స్టేషన్‌ఘన్‌పూర్: మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు పాలిసెట్ తదితర పరీక్షలకు కౌన్సెలింగ్ కోసం హెల్ప్‌లైన్ మంజూరైందని ప్రిన్సిపాల్ జి.గంగారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిసెట్, ఈసెట్, ఏపీసెట్, ఐసెట్ తదితర పరీక్షల కౌన్సెలింగ్‌కు ఈ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. ఈనెల 27న పాలిసెట్ మొదటి విడత అడ్మిషన్ ప్రక్రియతో హెల్ప్‌లైన్ సెంటర్ ప్రారంభమవుతుందన్నారు. పాలిసెట్ కు అర్హత సాధించిన విద్యార్థులు మొదటి విడ త కౌన్సెలింగ్‌కు ఈనెల 27 నుంచి 31వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు. 29 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకుని, జూన్ 3 నుంచి ఆప్షన్స్ ఇచ్చుకోవాలని తెలిపారు. కాగా గతంలో కేవలం జిల్లా కేంద్రమైన జనగామకే పరిమితమైన హెల్ప్‌లైన్ సెంటర్ స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు మంజూరు కావడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సభ్యత్వ నమోదులో ప్రథమ స్థానంలో ఉండాలి
పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల): బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతీ కార్యకర్త భాగస్వామి కావాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పాలకుర్తి నియోజకవర్గం సభ్యత్వ నమోదులో మొదటి స్థానంలో నిలిచిందని, ఈ సారి కూడా ఆదే స్ధాయిలో కృషి చేయాలని కార్యర్తలకు సూచించారు. సమావేశంలో నాయకులు పల్లా సుందర్ రామ్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంసింగ్, వీరారెడ్డి దామోదర్‌రెడ్డి, సుందర్, సోమనర్స య్య, కాశీం, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఎయిర్‌పోర్ట్ భూమిలో బోర్డుల ఏర్పాటు
మామునూరు: విమానాశ్రయ పునరుద్ధరణలో భాగంగా రన్‌వే విస్తరణ కోసం నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాల రైతుల నుంచి 230 ఎకరాలు సేకరించారు. ఆ భూమి చుట్టూ ఆదివారం ఫెన్సింగ్, బోర్డుల ఏర్పాటు కు చర్యలు తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్ అథా రిటీ అధికారుల పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జూన్ మొదటి వారంలో విమానాశ్రయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది.
8 నుంచి ఎంసీఏ
రెండో సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంసీఏ సెకండియర్ రెండో సెమిస్టర్ (సీబీసీఎస్) రెగ్యులర్, ఎక్స్‌అండ్ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు జూన్ 8 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. జూన్ 8న మొదటి పేపర్, 10న రెండో పేపర్, 12న మూడో పేపర్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు.
పీఆర్సీ ప్రకటించాలి: డీటీఎఫ్
విద్యారణ్యపురి: ఉద్యోగ సంఘాల జేఏసీకి సీఎం ఇచ్చిన హామీ మేరకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. హనుమకొండలోని డీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన హనుమకొండ జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్‌రెడ్డి, అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు డాక్టర్ ఎం.గంగాధర్, డీటీఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, బాధ్యులు బి.అంజనీదేవి, ఎస్.సుమ, ఎం.సారంగపాణి, ఎ.కిషన్, అల్లం మల్లయ్య, రాష్ట్ర కౌన్సిలర్లు పాల్గొన్నారు.


