నేటినుంచి పాఠ్యపుస్తకాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి పాఠ్యపుస్తకాల పంపిణీ

May 25 2026 3:16 AM | Updated on May 25 2026 3:16 AM

జనగామ: 2026–27 నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు నోటు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. జిల్లాలోని అన్ని మండలాల ఎమ్మార్సీ సెంటర్లకు పుస్తకాల సరఫరా దాదాపుగా పూర్తయింది.

నేటి నుంచి పంపిణీ

మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీ సెంటర్లలో ఉన్న పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందించే ప్రక్రియ ప్రారంభమవుతోంది. ప్రతీ పాఠశాల నుంచి ముందుగానే పంపిన ఇండెంట్ల ప్రకారం పుస్తకాల కేటా యింపు జరగనుంది. ఇప్పటికే గతేడాది డేటాను ఆధారంగా తీసుకొని నోటు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. జిల్లా పరిషత్‌ పాఠశాలలు, ప్రభు త్వ, పీఎస్‌, యూపీఎస్‌, కేజీవీబీ, మోడల్‌, సోషల్‌ వెల్ఫేర్‌, ఆశ్రమ పాఠశాలలు, మహాత్మా జ్యోతి బాఫూలే, సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలు 481 ఉన్నా యి. వీటిలో సుమారు 37 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. బడి బాటలో ఈ సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం జిల్లాకు అవసరమైన 2,06,460 పాఠ్యపుస్తకాలకు గాను ఇప్పటి వరకు 1,97,890 పుస్తకాలు చేరుకున్నాయి. మిగిలిన పుస్తకాలు త్వరలో రానున్నాయి. హెడ్‌మాస్టర్లు తమ పాఠశాలలకు కేటాయించిన సంఖ్య ప్రకారం పాఠ్య, నోటుపుస్తకా లను తీసుకెళ్లనున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం తర్వాత కొత్తగా చేరే విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో విడతలో పంపిణీ చేయనున్నారు. ఈనేపథ్యంలో బడిబాట తర్వాత ఎన్ని అడ్మిషన్లు వచ్చాయనే సమాచారాన్ని జిల్లా నుచి ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపించనున్నారు.

జిల్లాకు చేరుకున్న 1.97 పుస్తకాలు

37 వేల మంది విద్యార్థులకు లబ్ధి

కొత్త అడ్మిషన్లకు రెండో విడత సరఫరా

పాఠ్య, నోటుపుస్తకాల వివరాలు

అవసరమైన పాఠ్యపుస్తకాలు : 2,06,460

ఇప్పటికే వచ్చిన పాఠ్యపుస్తకాలు : 1,97,890

ప్రభుత్వ పాఠశాలల సంఖ్య : 481

విద్యార్థుల మొత్తం సంఖ్య : 37వేలు

Advertisement
 
Advertisement
Advertisement