● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం, మొక్కజొన్నను వెంటనే మిల్లులకు తరలించాలని కొనుగోళ్ల వివరాలను ఓపీఎంఎస్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్ తో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల పనితీరుపై అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ భాస్కర్, మార్క్‌ఫెడ్ డీఎం చంద్రశేఖర్, డీసీఓ కోదండరాములు, డీఎంఓ రామకృష్ణ, అదనపు డీఆర్‌డీఓ నూరుద్దీన్, పౌరసరఫరాల సంస్థ డీఎం హతీరామ్, డీసీఎస్‌ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ పాల్గొన్నారు.
ప్రతీ ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలి
ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రేరణ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వైద్యులు (170 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రేరణ సర్వీస్ సొసైటీ సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా, వైద్యులు శ్రీకాంత్, కరుణాకర్, డీజీఓ ప్రీతి, మేనేజర్ దయాకర్, నిర్వాహకులు మల్యాల సురేష్, చింతల గణేష్, వైద్య సిబ్బంది, సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


