● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ: పట్టణ అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే పట్టణంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో భాగంగా ముందుగా నెహ్రూ పార్క్ సమీపంలోని శ్మశాన వాటికను సందర్శించి అక్కడ జరుగుతున్న సుందరీకరణ పనుల పురోగతిపై మున్సిపల్ కమిషనర్‌ను ఆరా తీశారు. అలాగే 29వ వార్డులోని శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. ప్రజలకు ఉపయోగపడేలా అక్కడ స్థల లభ్యతను బట్టి పార్కు లేదా ఓపెన్ జిమ్ ఏర్పా టు చేసే అవకాశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అనంతరం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. స్టేషన్‌లో ముఖ్యౖ మెన రైళ్లు ఆగకపోవడం, రైళ్లు సమయానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రైళ్ల హాల్టింగ్, సమయపాలనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి రైల్వే జనరల్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్ సజ్జ దుర్గా ప్రసాద్, జూకంటి శ్రీశైలం, మామిడాల రాజు, ధర్మపురి శ్రీనివాస్, బిజ్జాల నవీన్, మసిర్ రెహమాన్, ఉల్లెంగుల సందీప్, యాకూబ్ ఉన్నారు.


