మైనింగ్‌ అనుమతులు రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ అనుమతులు రద్దు చేయాలి

May 23 2026 1:58 AM | Updated on May 23 2026 1:58 AM

కలెక్టర్‌కు డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి వినతి

జనగామ: జిల్లాలోని దేవరుప్పుల మండలం లకావత్‌ తండా పంచాయతీ పరిధిలోని వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి గుట్ట ప్రాంతంలో మైనింగ్‌ అనుమతులు రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతిలక్ష్మినారాయణ నాయక్‌ శుక్రవారం కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాకు వినతి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మైనింగ్‌కు అనుమతులు మంజూరు కావడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. ఈ నిర్ణయం పర్యావరణానికి మాత్రమే కాకుండా ఆ ప్రాంత ఆధ్యాత్మిక, సామాజిక, వ్యవసాయ ప్రాతిపదికలకు ముప్పు కలుగుతుందని తెలిపారు. మైనింగ్‌ అనుమతులను తీవ్రంగా వ్యతిరేకి స్తున్నామని, వెంటనే రద్దు చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు పరిదుల భాస్కర్‌, లకావత్‌ తండా గ్రామ అధ్యక్షుడు బొడా యాకన్న, వార్డు సభ్యురాలు లకావత్‌ వెన్నెల, పొట్టిగుట్ట తండా సర్పంచ్‌ అనిత చందులాల్‌, ధరవతే తండా సర్పంచ్‌ అనిత రవీందర్‌, నల్లకుంట తండా పార్టీ అధ్యక్షుడు భాస్కర్‌, అలాగే ఇతర సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement