● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: తెలంగాణ దళిత ఉద్యమ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల సామాజిక, విద్యా, ఆత్మగౌరవ ఉద్యమాలకు భాగ్యరెడ్డి వర్మ తన జీవితం అంకితం చేశారన్నారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు, పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


