కొడకండ్ల: మండల కేంద్రంలో టీజీఆర్‌ఎస్ జేసీ గురుకుల పాఠశాలలో అతిథి అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తమ్మి దిలీప్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. గురుకులంలో ఇంటర్మీడియట్ స్థాయిలో బోధించేందుకు బోటనీ, జువాలజీ, మ్యాఽథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు పాఠశాల స్థాయిలో తెలుగు, ఇంగ్లిష్, గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ అధ్యాపకులు, ఉపాధ్యాయులు కావాలని తెలిపారు. కళాశాల స్థాయిలో అభ్యర్థులు సంబంధిత పీజీ, బీఈడీ, పాఠశాల స్థాయిలో డిగ్రీ, బీఈడీ అర్హత కలిగి ఉండాలని, అర్హత కలిగిన వారు ఈ నెల 22 నుంచి 28 వరకు తమ గురుకులంలోని కార్యాలయంలో దరఖాస్తులు చేసుకొని డెమో క్లాస్‌కు హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 9866559710 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.
26న జిల్లాస్థాయి
బ్యాడ్మింటన్ ఎంపికలు
జనగామ రూరల్: జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ సెలక్షన్స్ కమ్ టోర్నమెంట్ పట్టణంలోని మినీ స్టేడియంలో ఈనెల 26వ తేదీన జరుగుతాయని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపగోని సుగుణాకర్, సెక్రటరీ కై రిక హనుమంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 19 ఏళ్ల లోపు బాలబాలికలు, అలాగే మహిళలు, పురుషులకు సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో టోర్నమెంట్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 19 ఏళ్ల లోపు గెలుపొందిన బాలబాలికలకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగే రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో పాల్గొంటారని, అదేవిధంగా మహిళలు, పురుషులు సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో గెలుపొందిన క్రీడాకారులు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారని తెలిపారు. వివరాలకు 9951999512 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
బాధ్యతల స్వీకరణ
పాలకుర్తి టౌన్: రాష్ట్ర మమిళా కమిషన్ సభ్యురాలిగా మండల కేంద్రానికి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత గురువారం హైదరాబాద్‌లో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. శ్వేతకు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, పాలకుర్తి మాజీ సర్పంచ్ వీరమానేని యాకాంతరావు, పులి గణేష్ తదితరులు అభినందనలు తెలిపారు.
12 నుంచి నాటక పోటీలు
నయీంనగర్: జూన్ 12, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు జాతీయస్థాయి నాటక పోటీలు స్థానిక కాళోజీ కళాక్షేత్రం హనుమకొండలో నిర్వహించాలని కమిటీ నిర్ణయించినట్టు వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక తెలంగాణ అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య, ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎస్‌ఆర్ మూర్తి తెలిపారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పోటీల్లో తెలంగాణనుంచి మూడు, ఆంధ్రప్రదేశ్ మూడు మొత్తం ఆరు నాటకాలు ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు.


