జనగామ: జిల్లాలోని దేవరుప్పుల మండలం లకావత్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని పుణ్యక్షేత్రం శ్రీవానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి ఆలయం మైనింగ్ మాఫియా చేతిలో పడి ఉనికి కోల్పోతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన బీఆర్‌ఎస్ మండల బృందంతో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలిసి మెమోరాండం అందజేశారు. అనంతరం దయాకర్‌రావు మాట్లాడుతూ..గుట్టపై జరుగుతున్న మైనింగ్ పర్మిషన్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎస్‌కు వివరాలు తెలియజేసి మైనింగ్ పర్మిషన్ రద్దు చేయించడంతో పాటు రూ.2 కోట్లతో దేవస్థానం అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల నిలిచిపోయిన మైనింగ్ చర్యలు మళ్లీ ప్రారంభమయ్యాయని, గుట్ట వద్ద పనులను అడ్డుకునేం దుకు వెళ్లిన బీఆర్‌ఎస్ నాయకులపై కేసులు పెట్టి నోటీసులు ఇవ్వడం పూర్తిగా అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్‌రామిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, బసవ మల్లేశం, పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, వర్కింగ్ అధ్యక్షుడు రామ్‌సింగ్, సర్పంచులు జాటోతు ఆనంద్, చందూ లాల్ నాయక్, రాములు, నాయకులు రత్నాకర్ రెడ్డి, మహేష్, ఏల సుందర్, పాము మోహన్, బసవ వెంకన్న, రాజన్న, కృష్ణమూర్తి, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు మాజీ మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి


