నిరంతర విద్యుత్‌ అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నిరంతర విద్యుత్‌ అందించడమే లక్ష్యం

May 22 2026 4:28 AM | Updated on May 22 2026 4:28 AM

బచ్చన్నపేట: విద్యుత్‌ వినియోగదారులకు లో–ఓల్టేజ్‌ సమస్యలు లేకుండా, నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ సరఫరా అందించడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తోందని టీజీఎన్పీడీసీఎల్‌ జనగామ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ చెరుకు సంపత్‌ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పడమటి కేశ్వాపూర్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న 5.0 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ స్థానంలో, అదనంగా ఏర్పాటు చేసిన నూతన 8.0 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆయన విజయవంతంగా ఛార్జ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. ఈ నూతన పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుతో సబ్‌స్టేషన్‌ సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. దీనివల్ల పడమటి కేశ్వాపూర్‌, పరిసర ప్రాంతాల వినియోగదారులకు, రైతులకు మెరుగైన ఓల్టేజ్‌తో కూడిన నాణ్యమైన విద్యుత్‌ అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజనల్‌ ఇంజనీర్లు లక్ష్మీనారాయణ రెడ్డి, డి.విజయ్‌కుమార్‌, అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్లు వేణుగోపాల్‌, శ్రీధర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్లు సతీష్‌, ఎ.కుమారస్వామి, విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

జనగామ సర్కిల్‌ ఎస్‌ఈ చెరుకు సంపత్‌ రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement