మున్సిపల్‌ కౌన్సిల్‌ ఫోరం జిల్లా చైర్మన్‌గా పాండు యాదవ్‌ | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ కౌన్సిల్‌ ఫోరం జిల్లా చైర్మన్‌గా పాండు యాదవ్‌

May 22 2026 4:28 AM | Updated on May 22 2026 4:28 AM

జనగామ: మున్సిపల్‌ కౌన్సిల్‌ ఫోరమ్‌ జిల్లా చైర్మన్‌గా 15వ వార్డు కౌన్సిలర్‌ మారబోయిన పాండు యాదవ్‌ను నియమిస్తూ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఫోరం రాష్ట్ర చైర్మన్‌ భూక్య రామునాయక్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కమిటీ సూచనల మేరకు బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపల్‌ కౌన్సిలర్లతో సమన్వయం కలిగి ఫోరం అభివృద్ధికి పనిచేయాలని పాండు యాదవ్‌ను ఫోరం ఆదేశిం చింది. కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న పాండు యాదవ్‌కు రాష్ట్ర ఫోరం శుభాకాంక్షలు తెలుపుతూ.. జిల్లాలో ఫోరమ్‌ కార్యకలాపాల పురోగతికి కృషి చేయాలంటూ సూచనలు చేసింది.

ఏఐ లైఫ్‌ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ

మహబూబాబాద్‌ అర్బన్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) లైఫ్‌ స్కిల్స్‌పై ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో పాటు డిగ్రీ ఆపైన చదివిన బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీసీ స్టడీ సర్కిల్‌ ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ మాడిశెట్టి నరసింహస్వామి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూన్‌ 1నుంచి 4వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. హనుమకొండలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 0870– 2571192నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement