● డీసీపీ రాజమహేంద్రనాయక్
లింగాలఘణపురం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆన్నారు. గురువారం మండలంలోని నెల్లుట్ల, కుందారం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మహాలక్ష్మి, మహేశ్వర మిల్లుల వద్దకు వెళ్లి ట్రాక్టర్లలో తీసుకొచ్చిన ధాన్యాన్ని మిల్లుర్లు వెంటనే అన్‌లోడింగ్ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి లారీలను కేంద్రాలకు వెళ్లే విధంగా చర్య తీసుకోవాలని సూచించారు. సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై శ్రావణ్‌కుమార్, సర్పంచ్ రాజు , సీసీ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.


