నిప్పుల కొలిమి | - | Sakshi
Sakshi News home page

నిప్పుల కొలిమి

May 21 2026 1:59 AM | Updated on May 21 2026 1:59 AM

రెడ్‌ అలర్ట్‌ గ్రామాలు (ఉష్ణోగ్రతలు)

వడ్లకొండ (జనగామ) 46.3

కూనూర్‌ (జఫర్‌గఢ్‌) 45.9

జనగామ 45.6

బచ్చన్నపేట 45.5

పాలకుర్తి(వావిలాల) 45.6

మల్కాపూర్‌ (చిల్పూర్‌) 45.1

జిల్లాలో 46డిగ్రీలు దాటుతున్న

ఉష్ణోగ్రతలు

ఎండ వేడిమి, వడగాలులతో బయటకు రావాలంటే జంకు

5 మండలాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ

జనగామ: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వేడి తీవ్రత భారీగా పెరగడంతో బుధవారం వాతావరణ శాఖ రెడ్‌, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. పలు మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటగా, కొన్ని చోట్ల 46 డిగ్రీలు దాటాయి. ప్రజలు వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ విడుదల చేసిన ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాల తాజా గణాంకాల ప్రకారం.. జిల్లాలోని ఐదు మండలాల్లో రెడ్‌ అలర్ట్‌ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నమోదైన డేటా ప్రకారం జిల్లాలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 46 డిగ్రీలు దాటాయి.

రెడ్‌ అలర్ట్‌

రఘునాథపల్లి, లింగాలఘణపురం, జఫర్‌గఢ్‌, తరిగొప్పుల, నర్మెట, పాలకుర్తి, దేవరుప్పుల, తాటికొండ తదితర ప్రాంతాలలో 43 నుంచి 44.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అధికారులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పౌరులు అత్యవసరమైతేనే బయటకు రావాలని, నీరసం, హీట్‌స్ట్రోక్‌ నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement