దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలపై ఉండాలి | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలపై ఉండాలి

May 21 2026 1:59 AM | Updated on May 21 2026 1:59 AM

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రఘునాథపల్లి: మండలంలోని మండలగూడెంలో జరుగుతున్న దుర్గమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడి యం శ్రీహరి బుధవారం పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై నిండుగా ఉండాలని మొక్కినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ మారుజోడు రాంబాబు, సర్పంచ్‌ రాజశేఖర్‌, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్‌, ఉత్తెపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని గిద్దబండతండాలో కాంగ్రెస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు లకావత్‌ సీతారాం, ధరావత్‌ భీమా అనారోగ్యంతో మృతిచెందగా నివాళి అర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement