‘మెడికల్‌ షాపుల బంద్‌కు మేం వ్యతిరేకం’ | - | Sakshi
Sakshi News home page

‘మెడికల్‌ షాపుల బంద్‌కు మేం వ్యతిరేకం’

May 20 2026 1:52 AM | Updated on May 20 2026 1:52 AM

జనగామ: ఆన్‌లైన్‌ మెడిసిన్‌ విక్రయాలపై నిరసనగా కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చిన బంద్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఫార్మసిస్ట్‌ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బెజగం అశో క్‌, ఉపాధ్యక్షుడు మౌర్య నాగరాజు, ప్రధాన కార్యదర్శులు గడెపాక సంపత్‌, సోం ప్రకాశ్‌ తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ చట్టం ప్రకారం ఫార్మసిస్ట్‌ పర్యవేక్షణలోనే మందులు అమ్మాలనే నిబంధన ఉన్నప్పటికీ, జిల్లాలో అనేక మెడికల్‌ షాపులు ఫార్మసిస్ట్‌ లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కీలక సమస్య పై చర్యలు తీసుకోకుండా కేవలం ఆన్‌లెన్‌ అమ్మకాలపై మాత్రమే నిరసనలు చేయడం అన్యాయమన్నారు.

మందుల సరఫరాలో

అంతరాయం ఉండదు

జనగామ: దేశవ్యాప్తంగా ఆల్‌ ఇండియా కెమిస్టుల(మెడికల్‌ సాపులు) బంద్‌ నేపథ్యంలో జిల్లాలో ప్రజలకు అత్యవసర మందుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టినట్లు జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మెడికల్‌ షాపుల యాజమాన్యాలకు అవసరమైన సూచనలు జారీ చేశారన్నా రు. అత్యవసర పరిస్థితుల్లో మందుల లభ్యతకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ : 1800 425 660, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ 9849634754, 8333925867 నంబర్లలో సంప్రదించాలన్నారు.

యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి

జనగామ రూరల్‌: యువత అవకాశాలను అందిపుచ్చుకొని భవిష్యత్‌లో ఉన్నతంగా స్థిరపడాలని జిల్లా యువజన క్రీడల అధికారి నరసింహారావు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం యువజన క్రీడల వారోత్సవాలలో పట్టణంలోని ధర్మకంచ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, ఏకశిలా ఐటీఐ కళాశాలలో టీశాట్‌ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణ ఉద్యోగ కల్పన ,క్రీడా యూనివర్సిటీ, భారత సైన్యంలో ఇచ్చే శిక్షణలు, ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. వారిలో సెట్విన్‌ జా యింట్‌ డైరెక్టర్‌ వేణుగోపాలరావు, ఓఎస్‌డీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ నుంచి కె.నర్సయ్య, మమతారావు, సునీల్‌ యాదవ్‌ ఉన్నారు.

ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ షురూ

ద్యారణ్యపురి: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం సంస్కృతం సబ్జెక్టు జవాబు పత్రాల వాల్యుయేషన్‌ నిర్వహించారు. చీఫ్‌ ఎగ్జామినర్లు, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు (అధ్యాపకులు) 49 మంది వాల్యుయేషన్‌ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాకు హనుమకొండలోని ప్రభుత్వ జూని యర్‌ కళాశాల స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రంగా ఉంది. అన్ని సబ్జెక్టులు కలిపి ఈ క్యాంపునకు 88,512 జవాబుపత్రాలు కేటాయించారు. మొదటిదశలో ఇంగ్లిష్‌, హిందీ సబ్జెక్టుల పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షల జవాబుపత్రాలు అలాగే మ్యాథ్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌ 1 పేపర్‌ 2 జవాబు పత్రాల వాల్యుయేషన్‌ నిర్వహించనున్నట్లు క్యాంప్‌ ఆఫీసర్‌, డీఐఈఓ ఎ.గోపాల్‌, ఏసీఓ జనరల్‌–1 శ్రీనివాస్‌రావు తెలిపారు. రెండో దశలో ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌, బాటనీ, జూ వాలజీ, కెమిస్ట్రీ, కామర్స్‌, హిస్టరీ సబ్జెక్టుల పేపర్‌–1, పేపర్‌–2 జవాబు పత్రాల వాల్యుయేషన్‌ ఈనెల 24 నుంచి నిర్వహించనున్నారు.

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి

ఖిలా వరంగల్‌: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల రాష్ట్ర టీజీఏ అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, నాయకులు అచ్చవిద్యాసాగర్‌, జేఏసీ కన్వీనర్‌ దిడ్డి నరేందర్‌ మంగళవారం డిమాండ్‌ చేశారు. కరీమాబాద్‌లోని చట్లోళ్ల గడ్డ వద్ద ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్‌ మరుపల్లి రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement