● జిల్లాలో 90.59శాతం మ్యాపింగ్ పూర్తి
● మండలాల వారీగా పురోగతిని
సమీక్షించిన కలెక్టర్
జిల్లా ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ సమాచారం
జనగామ: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 2025 నాటికి జిల్లాలో మొత్తం 7లక్షల73 వేల503 ఓటర్లలో 7లక్షల709 మందికి మ్యాపింగ్ పూర్తి కాగా, 90.59 శాతం నమోదుకు చేరింది. ఇంకా 72,794 మంది ఓటర్ల మ్యాపింగ్ పెండింగ్‌గా ఉంది. అనామలీస్(పేర్లలో తప్పు ఒప్పులు) సంఖ్య 2,33,757గా, 31.93 శాతంగా ఉంది. అలాగే ఈ నెల18 వ తేదీతో పోలిస్తే జిల్లా మ్యాపింగ్ పురోగతి 3,274 మేర పెరిగినట్లు అధికారులు తెలిపారు.
కలెక్టర్ సమీక్ష..
మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్‌ఐఆర్ పురోగతిపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వివిధ మండలాల తహసీల్దార్లు, ఆర్డీఓతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీఎల్‌ఓల పనితీరును కచ్చితంగా పర్యవేక్షించి, లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. జూన్ 24 నుంచి జూలై 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు తమ బీఎల్‌ఓ వివరాలు తెలియజే సేందుకు ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, చేర్యాల, ధర్మసాగర్, సిద్దిపేట తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
మొత్తం ఓటర్లు (2025): 7,73,503
మ్యాపింగ్ పూర్తయినవారు: 7,00,709
మ్యాపింగ్ పెండింగ్: 72,794
మ్యాపింగ్ శాతం: 90.59
అనామలీస్ మొత్తం: 2,23,765
అనామలీస్ శాతం: 31.93


