రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

May 20 2026 1:52 AM | Updated on May 20 2026 1:52 AM

సివిల్‌ సప్లై జిల్లా మేనేజర్‌ హతిరామ్‌

లింగాలఘణపురం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీరియల్‌ ప్రకారం తూకం వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సివిల్‌ సప్లై జిల్లా మేనేజర్‌ హతిరామ్‌ తెలిపారు. మండలంలోని మాణిక్యాపురంలో పొన్నం తిరుమలేశ్‌ అనే రైతు ధాన్యాన్ని సీరియల్‌ ప్రకారం తూకం వేయకుండా జాప్యం చేయడంతో మనోవేదనతో ఈ నెల 17న ఒంటిపై డీజిల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై ‘సాక్షి’లో ‘కొనుగోలు కేంద్రంలో రైతు ఆత్మహత్యాయత్నం’, అదేవిధంగా పాలకుర్తిలో ఽ‘ధాన్యం ఽకొనుగోళ్లలో జాప్యం’ అనే శీర్షికలతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి కేంద్రాల వద్దకు వెళ్లి జరిగిన పొరపాటును సరిచేసి రైతు ధాన్యం తూకం వేయడం జరిగిందని వివరించారు. ఏవైనా పొరపాట్లు చేస్తే చర్యలు తీసుకుంటామని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు.

ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి

టెండర్ల ఆహ్వానం

మామునూరు: వరంగల్‌ మామునూరు విమానాశ్రయం అభివృద్ది పనుల కోసం అధికారులు టెంబర్లను ఆహ్వానించినట్లు తెలిసింది. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారులు ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. భూ నిర్వాసితుల నుంచి సేకరించిన రన్‌వే స్థలానికి పెన్షింగ్‌, బోర్డులు ఏర్పాటు, ప్రాంగణంలోని ఏపుగా పెరిగిన ముళ్లపొదలు, ఇతర చెట్ల తొలగింపు, విమానాశ్రయంలో భూసార పరీక్షలకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. 180 రోజుల్లో పర్యావరణ అనుమతులు, భూసార పరీక్షలు నిర్వహించేందుకు టెండర్‌దారులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిసింది. కాగా టెండర్ల దాఖలుకు మంగళవారం సా యంత్రం 4గంటల వరకు చివరి అవకాశం ఉన్న ట్లు సమాచారం. టెండర్లను 20న సాయంత్రం 5 గంటలకు ఫైనల్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. పనులను దక్కించుకునే కాంట్రాక్టర్‌ 180 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement