నీడ లేక ప్రయాణికుల అవస్థలు | - | Sakshi
Sakshi News home page

నీడ లేక ప్రయాణికుల అవస్థలు

May 20 2026 1:52 AM | Updated on May 20 2026 1:52 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: గత మేజర్‌ గ్రామ పంచాయతీ, ఘన్‌పూర్‌కు జంటపట్ణణం, ప్రస్తుతం స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి ఏళ్ల తరబడి కనీసం బస్‌షెల్టర్‌కు నోచుకోవడం లేదు. శివునిపల్లి నుంచి అనునిత్యం ప్రయాణికులు పాలకుర్తి, జఫర్‌గడ్‌, ఐనవోలు, హిమ్మత్‌నగర్‌ తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. పాలకుర్తి, జఫర్‌గడ్‌, హిమ్మత్‌నగర్‌కు ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఉంది. అయితే శివునిపల్లిలో ప్రధానంగా వివేకానంద చౌరస్తా, రైల్వేస్టేషన్‌, అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద ప్రయాణికులు బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు ఎక్కుతుంటారు. అయితే ఏళ్ల తరబడి శివునిపల్లిలో ఒక్క బస్‌షెల్టర్‌ కూడా లేదు. ఎంతో ఘన చరిత్ర ఉన్న శివునిపల్లిలో కనీసం బస్‌షెల్టర్‌ లేకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుత వేసవికాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉండగా శివునిపల్లి నుంచి ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లేవారు వాహనాల కోసం మండుటెండలో నిల్చుని ఎదురు చూస్తున్నారు. శివునిపల్లిలోని మూడు సెంటర్ల వద్ద కనీసం నిలువ నీడ లేకపోవడంతో ప్రయాణికులు అరిగోస పడుతున్నారు. ఇప్పటికై నా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి బస్‌షెల్టర్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మండుటెండలో

ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

బస్‌షెల్టర్‌కు నోచుకుని శివునిపల్లి

Advertisement
 
Advertisement
Advertisement