రైతుల ఇబ్బందులు తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

రైతుల ఇబ్బందులు తొలగించాలి

May 20 2026 1:52 AM | Updated on May 20 2026 1:52 AM

జనగామ రూరల్‌: కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొచ్చి విక్రయించేందుకు రోజులతరబడి ఎదురు చూస్తున్నారని, వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్‌ కోరారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్‌ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కిసాన్‌ మోర్చా నాయకుడు సోమిడి వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకుడు సరికొండ విద్యాసాగర్‌రెడ్డి, బుడుగుల రమేశ్‌, శివరాజ్‌, బొజ్జపల్లి సుభాష్‌, కొంతం శ్రీనివాస్‌, తోకల ఉమారాణి, దేవర ఎల్లయ్య, కావటి ముత్యాలు, పిట్టల సత్యం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement