ఎన్‌హెచ్‌–365బీపై ప్రమాద ప్రాంతాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌–365బీపై ప్రమాద ప్రాంతాల పరిశీలన

May 20 2026 1:52 AM | Updated on May 20 2026 1:52 AM

పాలకుర్తి టౌన్‌(దేవరుప్పల): మండలంలోని ఎన్‌హెచ్‌–365బీ జాతీయ రహదారిపై ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలు, బ్లాక్‌ స్పాట్లను ఆధికారులు మంగళవారం పరిశీలించారు. పాలకుర్తి సీఐ జానకీరాంరెడ్డి, డీఈ రాజారాం, ఏడీఈ అశోక్‌కుమార్‌, ప్రాజెక్టు మేనేజర్‌ రామ్‌కుమార్‌, జిల్లా ఆర్టీఓ జీవీఎస్‌ గౌడ్‌లతో కలిసి ప్రమాద ప్రాంతాలను సందర్శించారు. రహదారిపై తరుచుగా ప్రమాదాలు జరగుతున్న ప్రాంతాలను గుర్తించి, ప్రమాద నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన సదుపాయాలను అధికారులు చర్చించారు. హెచ్చరిక బోర్డులు, రోడ్డు భధ్రత చర్యలు ,ట్రాపిక్‌ నియంత్రణ చర్యలను మెరగుపరచాలని సూచనలు చేశారు.దేవరుప్పల, లింగాల ఘన్‌పూర్‌ ఎస్సైలు సృజన్‌కుమార్‌, శ్రవణ్‌కుమార్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement