నర్మెట: వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటే రైతులకు అదనపు సమకూరుతుందని హెరిటేజ్ జనగామ ప్లాంట్ మేనేజర్ వినోద్ కుమార్ అన్నారు. మండలకేంద్రంలో మంగళవారం చెవుల రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. సమీకృత దానా తయారీ, మినరల్ మిక్చర్, గడ్డి పెంపకం, పాల ఉత్పత్తిని పెంచుకునే దిశగా గేదెలకు ఇవ్వాల్సిన దానా, కాల్షియం సప్లిమెంట్స్‌పై అవగాహన కల్పించారు. పశువైద్యుడు వెంకటేష్, అసిస్టెంట్ లక్ష్మణ్, రైతులు దన్నారపు వీరారెడ్డి, బండి నవీన్, స్వామి, మల్లేషం తదితరులు ఉన్నారు.


