● తహసీల్దార్లకు కలెక్టర్
సందీప్ కుమార్ ఝా ప్రశంసలు
జనగామ: భూభారతి సేవల అమలులో జిల్లా రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలవడం విశేషం. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచిన జిల్లాకు ప్రభుత్వం నుంచి కూడా ప్రశంసలు వస్తున్న వేళ, కలెక్టర్ సందీప్ కుమా ర్ ఝా మంగళవారం జరిగిన భూభారతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో తహసీల్దార్‌లను అభినందించారు.
జిల్లాలో 1,028 పెండింగ్ దరఖాస్తులు
జిల్లాలో భూభారతి పెండింగ్ దరఖాస్తులు భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ, పరిష్కారం విషయంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చితే మెరుగ్గా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదిక మేరకు జిల్లాలో మొత్తం 1,028 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, వాటిలో 509 దరఖాస్తులు 60 రోజులకు లోపు ఉండగా, 519 దరఖాస్తులు రెండు నెలలకుపైగా పెండింగ్‌లో ఉన్నాయి.
కలెక్టర్ సమీక్ష..
సక్సెషన్, మ్యుటేషన్, ఖాతా సమీకరణ, డేటా కరెక్షన్, అర్బన్ ల్యాండ్, జీపీపీ, పీపీబీ, నాలా, కోర్టు కేసులు వంటి ప్రధాన మాడ్యూల్స్‌లో పెండింగ్స్‌ను అత్యవసరంగా తగ్గించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. పెండింగ్ దరఖాస్తులను రోజువారీగా ట్రాక్ చేయడంతో పాటు పెండింగ్‌లకు కారణాలు స్పష్టంగా నమోదు చేసి వెంటనే పరిష్కారం చూపాలన్నారు. సమీక్షలో ఆర్డీఓ కె.గోపీరాం, తహసీలార్లు పాల్గొన్నారు.
సేంద్రియ వ్యవసాయ విధానాన్ని పాటించాలి


