ఘనంగా దుర్గమ్మ ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా దుర్గమ్మ ఉత్సవాలు

May 20 2026 1:52 AM | Updated on May 20 2026 1:52 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని తానేదార్‌పల్లి గ్రామంలో కనకదుర్గమ్మ ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఎల్లమ్మ, దుర్గమ్మ బోనాల పండుగను చేపట్టారు. మహిళలు, వివిధ కుల సంఘాల పెద్దలు సామూహికంగా అమ్మవారి గుడివద్దకు వెళ్లి మొక్కులు సమర్పించారు. సర్పంచ్‌ మంతెన హరిత ఇంద్రారెడ్డి, నాయకులు దుంపల పద్మారెడ్డి, మాచర్ల గణేష్‌, చల్లా చందర్‌రెడ్డి, మాచర్ల కుమారస్వామి, ఆకుల కృష్ణంరాజు, మాచర్ల రఘురాములు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు

ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఆరురోజులుగా నిర్వహిస్తున్న రేణుకా ఎల్లమ్మతల్లి, వనం ఎల్లమ్మదేవత, కంఠమహేశ్వరస్వామి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఈ మేరకు సోమవారం రాత్రి ఘనంగా బోనాలను చేపట్టారు. మంగళవారం దేవాలయం వద్ద బలిపూజ నిర్వహించారు. కాగా, ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా సహకరించిన కౌన్సిలర్‌ పొన్న రాజేష్‌ను గౌడ కులపెద్దలు సన్మానించారు. కౌన్సిలర్లు పొన్న రాజేష్‌, బాలగాని అనీల్‌గౌడ్‌, గౌడ సంఘం అధ్యక్షుడు రంగు ప్రభాకర్‌, ఉపాధ్యక్షుడు వడ్లకొండ విజయ్‌, కార్యదర్శి రంగు ఎల్లయ్య, కోశాధికారి నర్సయ్య, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మాచర్ల అశోక్‌, ఉపాధ్యక్షుడు రంగు అనూప్‌కుమార్‌, కార్యదర్శి కోతి అజయ్‌, అనీల్‌, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement