కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇక్కట్లు | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇక్కట్లు

May 20 2026 1:52 AM | Updated on May 20 2026 1:52 AM

రఘునాథపల్లి: మండలంలోని కుసుంబాయితండా ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కేంద్రంలో 51 మంది రైతులకు చెందిన 8వేల ధాన్యం బస్తాలు నింపి వారం రోజులు గడిచినా ఎగుమతి కాక నిల్వ ఉండిపోయాయి. లారీలు రాక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లారీలు రాక పోవడంతో టార్పాలిన్ల అద్దె పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకాల వర్షాలు పడే అవకాశం ఉండటంతో ధాన్యం తడిసిపోతుందేమొన్న భయం రైతులను వెంటాడుతోంది. ధాన్యం విక్రయించి అప్పులు తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న రైతులు రవాణా సమస్య కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లారీలను ఏర్పాటు చేసి ధాన్యం తరలింపునకు చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు యాదగిరి, రఘుపతి, సంపత్‌, కమలాకర్‌, అంజయ్య, గట్టుమల్లు, సత్యనారాయణ, వెంకన్న, మల్లేశ్‌, కొమురెల్లి, సుందర్‌, దేవస్వామి, బాలు, హరిసింగ్‌ తదితరులు కోరుతున్నారు.

లారీల కొరతతో

ఎగుమతి కాని నిల్వలు

Advertisement
 
Advertisement
Advertisement