పరిశీలిస్తూ.. పరిష్కరిస్తూ | - | Sakshi
Sakshi News home page

పరిశీలిస్తూ.. పరిష్కరిస్తూ

May 19 2026 1:40 AM | Updated on May 19 2026 1:40 AM

జనగామ: అర్జీలను చదువుతూ..ప్రజలు చెప్పే సమస్యలను ఓపికగా విన్నారు.. అర్జీలోని అంశాన్ని చదువుతూ వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.. ప్రజలు అందించే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌తో కలిసి కలెక్టర్‌ ప్రజల నుంచి అర్జీల ను స్వీకరించారు. దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగి న చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. గ్రీవెన్స్‌లో జెడ్పీ సీఈఓ రంగారావు, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, సీపీఓ చిన కోట్యా నాయక్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అర్జీలు ఇలా..

● జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ నగర్‌ ఒకటో వార్డుకు చెందిన కె.రేణుక, రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన నరేష్‌, లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఆర్‌.రమ ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం అర్జీ పెట్టుకున్నారు.

● జిల్లా విజిలెనన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీలో చోటు కల్పించాలని జనగామ మండలం యశ్వంతాపూర్‌ గ్రామానికి చెందిన బొట్ల మహేష్‌ వినతి చేసుకున్నారు.

● జనగామలో గాంఽఽధీ బొమ్మ జంక్షన్‌ దగ్గర రోడ్డు సమస్యలతో పాటు యూటర్న్‌ బోర్డులు లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మాజీ కౌన్సిలర్‌ గాదెపాక రాంచందర్‌ కలెక్టర్‌కు వినతి చేశారు. ఫ్‌లైఓవర్‌ బ్రిడి్‌జ్‌ సమీపంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ లేకపోవడంతో రోడ్డు దాటాలంటే కష్టంగా మారిందని, వ్యాపారాల కోసం ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకోవడంతో ప్రజలకు ఇబ్బందిగా ఉందని, వాటికి ప్రత్యేక స్థలం కేటాయించాలన్నారు. ట్రాఫిక్‌ హెచ్చరిక బోర్డులతో పాటు స్పీడ్‌ లిమిట్‌ బోర్డులను ఏర్పాటు చేయాని కోరారు.

● తనకున్న ఎకరం 25 గుంటలు వ్యవసాయ భూమి ఉందని, రికార్డులో 2021 నుంచి భూమి కనిపించడం లేదని లింగాల ఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన పేరబోయిన వీరస్వామి అర్జీలో పేర్కొన్నారు. మీ సేవకు వెళ్తే పహాణీ రావడం లేదని, భూమిని తామే సాగు చేసుకుంటున్నామని, కాల్వ కోసం భూమి పోయిందంటున్నారు. తమకు ఒక్క పైసా రాలేదని, భూమిని రికార్డుల్లోకి ఎక్కించి న్యాయం చేయాలన్నారు.

● ఊరికి 8 ఇందిరమ్మ ఇల్లు వచ్చాయని, అందులో ఒక్కటి మాత్రమే పూర్తయిందని, ఇంకా ఏడు గృహాలు మధ్యలోనే ఆగిపోయాయని దేవరుప్పుల మండలం బంజర సర్పంచ్‌ ధరావత్‌ చిరంజీవి దరఖాస్తు చేశారు. ఇసుక తరలింపు ఆగిపోవడంతో సమస్య ఏర్పడిందని, అలాగే అభివృద్ధి పనులు, ఇళ్లకు సంబంధించిన రెనోవేషన్‌ పనులు చేయాలన్నా తట్టెడు ఇసుక కరువైయిందన్నారు.

ప్రజాసమస్యలను ఓపికగా విన్న కలెక్టర్‌

అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దంటూ అధికారులకు ఆదేశం

కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌కు పోటెత్తిన అర్జీదారులు

Advertisement
 
Advertisement
Advertisement