సర్పంచ్‌ ఆదర్శం..! | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ ఆదర్శం..!

May 19 2026 1:40 AM | Updated on May 19 2026 1:40 AM

లింగాలఘణపురం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి మూతబడే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మండలంలోని నేలపోగుల సర్పంచ్‌ గుగ్గిళ్ల నవిత తన కూతురు ప్రిన్సికి స్థానిక పాఠశాలలో అడ్మిషన్‌ తీసుకొని ఆదర్శంగా నిలిచారు. ప్రభు త్వ బడుల్లోనే మెరుగైన, నాణ్యమైన విద్య అందుతుందని, ప్రతీ తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల ని, ముందుగానే తాను చేర్పించి మిగిలిన వారిలో స్ఫూర్తిని నింపారు. హెడ్మాస్టర్‌ నవీన్‌ సమక్షంలో అడ్మిషన్‌ తీసుకోవడంతో పాఠశాల ఉపాధ్యాయ బృందం సర్పంచ్‌ నవితకు కృతజ్ఞతలు తెలిపారు.

కలెక్టర్‌పై కావాలనే విమర్శలు

టీపీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్‌

జనగామ: కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పనితీరుపై కావాలనే విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ సభ్యుడు లకావత్‌ లక్ష్మీనారాయణ నాయక్‌ అన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడా రు.. ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పారదర్శకంగా పనిచేస్తున్న సమయంలో ఇలాంటి వ్యతిరేక ప్రచారాలు చేయడం మంచిది కాదన్నారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌, మార్కెట్‌ చైర్మన్‌ ఎర్రమళ్ల సుధాకర్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కంచె రాములు, డీసీసీ ఉపాధ్యక్షులు ఉడత రవి యాదవ్‌, జనరల్‌ సెక్రటరీ జిల్లెల్ల సిద్ధారెడ్డి, ఎండీ అన్వర్‌, జమాల్‌ షరీఫ్‌, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement