● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: సామాజిక సమానత్వం, న్యాయం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న త్యాగస్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎన్.ఎల్.నరసింహరావు, ఏబీసీడీఓ రవీందర్, డీఎల్పీఓ వెంకట్ రెడ్డి, దిశ కమిటీ సభ్యులు బక్క శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు జాయా మల్లేష్, వైద్యుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి
నర్మెట (తరిగొప్పుల): ప్రభుత్వ సంక్షేమ పథకాలను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా తరిగొప్పుల గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. అనంతరం నూతన పథకాలైన ముఖ్యమంత్రి అల్పాహారం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, విభిన్న ప్రతిభా వంతులైన ఇంటర్ విద్యార్థులకు మోటారు వాహనాలు, పంట ల వైవిధ్యం, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ మొహసిన్ ముజ్తాబ, మండల ప్రత్యేక అధికారి రాణా ప్రతాప్, సర్పంచ్ అర్జుల జ్యోతి, కార్యదర్శి భాగ్యలక్ష్మి, కార్యదర్శి భాగ్యలక్ష్మి,అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.


