నియామకపత్రం అందుకున్న ధన్వంతి
జనగామ: డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి బుధవారం గాంధీభవన్‌లో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో అధిక స్థానాలు గెలుపొందాలని, ఓట్ చోరీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వానికి కార్యకర్తలకు సమన్వయం పరిచేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలు చేశారన్నారు. పార్టీ అధ్యక్షులకు, పార్టీ ఇన్‌చార్జ్‌కు లకావత్ ధన్వంతి కృతజ్ఞతలు తెలిపారు.
దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి
జనగామ రూరల్: దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని సీనియర్ సివిల్ జెడ్జి ఇ.సుచరిత అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని భవిత సెంటర్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జెడ్జి జి.శశి, ఎంఈఓ శంకర్‌రెడ్డి, డాక్టర్ లిఖిత, రవీంద్ర, దయామణి, ఎస్.రాములు, వి.శోభారాణి పాల్గొన్నారు.
రఘునాథపల్లి: మండలంలోని 36 గ్రామాలకు 5 గ్రామాలు ఏకగ్రీవంగా కాగా 31 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థులకు గుర్తులు కేటాయించినట్లు బుధవారం ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల గుర్తులు కేటాయించిన గంటలోనే వాట్సాప్ గ్రూపులలో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
4 నామినేషన్లు తిరస్కరణ
జనగామ రూరల్: మండలంలోని 21 గ్రామపంచాయతీలకు 149 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇందులో వడ్లకొండ నుంచి ఒక నామినేషన్‌ను తిరస్కరించారు. 198 వార్డు సభ్యులకు 569 మంది నామినేషన్లు దాఖలు చేయగా 3 తిరస్కరించారు. ఇందులో వెంకిర్యాల, గానుగుపహడ్, వడ్లకొండలో ఒక్కోటి చొప్పున ఉన్నాయి.
బరిలో 69మంది సర్పంచ్ అభ్యర్థులు
లింగాలఘణపురం: మండలంలోని 21 పంచాయితీలకు గాను 69 మంది, 196 వార్డులకు గాను 163 మంది పోటీలో ఉన్నారు. గతంలో నాలుగు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఈసారి కొత్తపల్లి, రామచంద్రగూడెంలో జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మండలంలో ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు. రామచంద్రగూడెంలో 8 వార్డులకు గానూ 4 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడి సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కోసం గ్రామస్తులు ముమ్మర ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు.
వేయిస్తంభాల ఆలయ ఆదాయం రూ.12,04,168
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో బుధవారం ఉదయం హుండీ లెక్కింపు నిర్వహించారు. 50 రోజుల హుండీ ఆదాయం రూ.4,57,768, పూజా టికెట్ల ద్వారా రూ. 7,46,400.. మొత్తం ఆదాయం రూ.12,04,168 వచ్చిందని ఈఓ ధరణికోట అనిల్‌కుమార్ తెలిపారు. పర్యవేక్షకుడిగా దేవాదాయశాఖ పరిశీలకుడు ప్రసాద్ వ్యవహరించారు. దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకుడు మణికంఠ శర్మ అవధాని, సిబ్బంది మధుకర్, లింగబత్తుల రామకృష్ణ, రజిత, రాజరాజేశ్వర సేవాసమితి మహిళా సభ్యులు పాల్గొన్నారు.
నియామకపత్రం అందుకున్న ధన్వంతి
నియామకపత్రం అందుకున్న ధన్వంతి


