కొత్తకొత్తగా ఉన్నది!
పాలకుర్తి టౌన్: జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రెండు గ్రామ పంచాయతీలు.. పాలకుర్తి మండలంలోని మేకల తండా, దుబ్బతండా(టీ)లో తొలిసారి ఎన్ని కలు జరగనున్నాయి. రెండేళ్ల క్రితం ఏర్పడ్డ జీపీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. తమ గ్రా మంలోని వ్యక్తినే సర్పంచ్‌గా ఎన్నుకునే అవకాశం వారికి ఈసారి దక్కుతుంది. స్వయంపాలన దిశగా అడుగులు వేస్తున్నా గ్రామాల్లో పరిస్థితిపై ప్రత్యేక కథనం.
‘గిరి’జన తండాలు పంచాయతీలుగా..
జిల్లాలో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుతూ 2018 ఆగస్టు 2న ప్రభుత్వం జీవో జారీ చేయగా 2019లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత పాలకుర్తి మండలంలో మేకలతండా, దుబ్బతండా(టీ) ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో, ప్రభుత్వం రెండేళ్ల క్రితం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. పాలకుర్తి మండలంలోని మేకలతండా.. కొండాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. రెండేళ్ల క్రితం కొత్త జీపీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఎన్నికలు లేకపోవడంతో స్థానిక పాలన లేదు. ఇప్పుడే తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. జనాభా 520.. ఓటర్లు 450 మంది ఉన్నారు. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వేషన్ అయింది. కొత్త గ్రామ పంచాయతీ దుబ్బతండా(టీ) మండలంలోని టీఎస్‌కే పరిధిలో ఉండేది. ఇక్కడ జనాభా 403కాగా.. ఓటర్లు 313మంది ఉన్నారు. జీపీగా ఏర్పాటైన తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. వందశాతం గిరిజనులు ఉండే ఈ రెండు జీపీల్లో స్వయం పాలన రానుంది.
కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ మేకలతండా
కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ
దుబ్బతండా(టీ)
కొత్తకొత్తగా ఉన్నది!


