ఏకగ్రీవ అభ్యర్థులకు నియామక పత్రాలు
స్టేషన్‌ఘన్‌పూర్: మండల పరిధిలోని 15 గ్రామ పంచాయతీలకుగాను జిట్టెగూడెంతండా గ్రామ పంచాయతీకి సర్పంచ్‌తో పాటు వార్డు స్థానాలకు ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేయడంతో గ్రామ పంచాయతీ పాలకమండలి ఏకగ్రీవమైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు గురువారం నియామకపత్రాలు అందించారు. ఆర్‌ఓ, ఏఆర్‌ఓ సమక్షంలో ఉపసర్పంచ్‌గా నునావత్ రజితను ఎన్నుకున్నారు. సర్పంచ్‌గా బానోతు బాలుతో పాటు ఎనిమిది వార్డు స్థానాలకు బానోతు మహేందర్, బానోతు స్వర్ణ, వాంకుడోతు రవి, నునావత్ రజిత(ఉపసర్పంచ్), లావుడ్య రోజ, భూక్య రవీందర్, లావుడ్య వెంకులు, లావుడ్య బుచ్చమ్మలకు నియామకపత్రాలు అందించారు. అదేవిధంగా మండలంలో ఏకగ్రీవమైన వార్డులలో చంద్రుతండాలో 7గురు, పాంనూర్‌లో నలుగురు, అక్కపెల్లిగూడెంలో ముగ్గురు, నమిలిగొండ ఒక్కరు, విశ్వనాధపురంలో ఒక్కరికి వార్డు సభ్యులుగా ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఆర్‌ఓ రాజేంద్రప్రసాద్, ఏఆర్‌ఓ అనీల్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి ఇల్లందుల సురేందర్ పాల్గొన్నారు.
చిల్పూరు: మండలంలో 17 జీపీలుండగా మూడు గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. గురువారం గార్లగడ్డతండాలో మాలోతు నవీన్, దేశాయితండాలో భూక్య వెంకట్, తీగలతండా తీగల సాంబరాజు ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ఉప సర్పంచ్‌లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎలినేని రామారావు, కార్యదర్శులు రంగారెడ్డి, తిరుమలరెడ్డి, భూక్య విమల తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపల్లి: మండలంలో ఐదు పంచాయతీల సర్పంచ్‌లు ఏకగ్రీవం కాగా గురువారం రెండు గ్రామాల ఉప సర్పంచ్‌ల ఎన్నిక పూర్తయినట్లు ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు తెలిపారు. అయా గ్రామాల్లో ఏకగ్రీవ సర్పంచ్‌లు వాకిటి అలివేలు, పారునంది సునీత సమక్షంలో వార్డు సభ్యులతో అధికారులు ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా రామన్నగూడెం ఉప సర్పంచ్‌గా ఎంపాల భాస్కర్, అయ్యవారిగూడెం ఉప సర్పంచ్‌గా పారునంది రాజీబ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.
నేడు దివ్యాంగుల
దినోత్సవం
జనగామ రూరల్: జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జూబ్లీ ఫంక్షన్ హాల్‌లో వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు, దివ్యాంగుల కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని వేడుకను విజయవంతం చేయాలని కోరారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఈసందర్భంగా క్రీడల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: ప్రభుత్వం రాజీవ్ విద్యా దీవెన స్కీమ్ కింద ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులు ప్రీ–మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి బి.విక్రమ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థి కులం, ఆదాయం, ఆధార్ లింక్, బ్యాంక్ అకౌంట్ ధ్రువీకరణ పత్రాలు జతపరచి సంబంధిత పాఠశాలలో సమర్పించాలన్నారు. డే స్కాలర్‌కు రూ.3,500లు, వసతి గృహ విద్యార్థులకు రూ.7,000లు సంబంధిత విద్యార్థుల బ్యాంక్ అకౌంట్‌కు సంవత్సరానికి ఒకసారి చెల్లించడం జరుగుతుందన్నారు. పాఠశాల యూడైస్ కోడ్‌తో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏమైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో సమస్యలు తలెత్తితే సంబంధిత కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ నెల చివరిలోగా పూర్తిగా నింపిన దరఖాస్తులను సంబంధిత జిల్లా కార్యాలయంలో అందజేయాలన్నారు.
ఏకగ్రీవ అభ్యర్థులకు నియామక పత్రాలు


