ఐదుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం
రఘునాథపల్లి: మండలంలోని 36 గ్రామ పంచాయతీల పరిధిలోని ఏడు నామినేషన్ కేంద్రాల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్ వేసిన అభ్యర్థుల ఉపసంహరణ గడువు బుధవారం ముగిసింది. మండలంలో ఐదు గ్రామాల్లో పోటీ లేకుండా ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. పడమటిగూడెం నుంచి బాలశౌరెడ్డి, రామన్నగూడెం – వాకిటి అలివేలు, వెల్ది – సింగిరెడ్డి సునీత, సోమయ్యకుంటతండా – కెతావత్ ఈర్యానాయక్, అయ్యవారిగూడెం –పారునంది సునీతలను సర్పంచ్‌లుగా అయా క్లస్టర్ గ్రామాల్లో అధికారులు ఏకగ్రీవంగా ప్రకటించి ధ్రువపత్రాలు అందజేశారు.
చిల్పూరు: మండలంలో 17 గ్రామ పంచాయతీలుండగా గార్లగడ్డతండా, తీగలతండా, దేశాయితండా పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ శంకర్‌నాయక్ తెలిపారు. తీగలతండాలో సర్పంచ్‌గా తీగల సాంబరాజు, ఉప సర్పంచ్‌గా బదావత్ తిరుపతి, వార్డు సభ్యులు లక్ష్మి, మేరి, భూక్య తిరుపతి, రవి, భద్రమ్మ, చంద్రకళ, అజ్మీర తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గార్లగడ్డతండాలో సర్పంచ్ మాలోతు నవీన్, ఉప సర్పంచ్ మాలోతు లింగ, వార్డు సభ్యులు సరిత, లక్ష్మ, రజిత, బుజ్జమ్మ, నాగేందర్, దేశాయితండాలో సర్పంచ్‌గా భూక్య వెంకట్, ఉప సర్పంచ్‌గా లాల్, వార్డు సభ్యులు రాజు, బుల్లి, జ్యోతి, కాశినాథ్, సుందర్, లలిత, మోతీలాల్, సుమన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జఫర్‌గఢ్: మండలంలోని దుర్గ్యా నాయక్‌తండాలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి బానోత్ అనూష యాకూబ్‌నాయక్ ఏకగ్రీవం అయ్యారు. గ్రామం నుంచి సర్పంచ్ స్థానానికి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా ముగ్గురు ఉపసంహరించుకున్నారు. దీంతో సర్పంచ్ అభ్యర్థిగా అనూష యాకూబ్‌నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే గ్రామం నుంచి ఆరుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు.
వెంకట్
సాంబరాజు
నవీన్
ఐదుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం
ఐదుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం
ఐదుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం
ఐదుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం
ఐదుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం
ఐదుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం
ఐదుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం
ఐదుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం


