వేచి ఉంటాం.. పాలన చేస్తాం..
స్టేషన్‌ఘన్‌పూర్: పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తుండడంతో వారి ప్రాతినిధ్యం పెరిగింది. దీంతో పల్లెల్లో ఎక్కడా చూసినా మహిళలే కనపడుతున్నారు. మండలంలోని ఇప్పగూడెం క్లస్టర్‌లోని ఇప్పగూడెం, అక్కపెల్లిగూడెం, సముద్రాల గ్రామ పంచాయతీల పరిధిలోని వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా అక్కపెల్లిగూడెం, ఇప్పగూడెం జీపీల వార్డు స్థానాలకు బరిలో ఉన్న వారు పోటీలో ఉన్నట్లుగా ధ్రువీకరణపత్రాలతో పాటు పోలింగ్ ఏజెంట్ల జాబితాను అందించేందుకు ఇప్పగూడెం గ్రామ పంచాయతీ వద్ద గంటల తరబడి వేచి ఉన్నారు. నిలబడే ఓపిక నశించిన వారు కాసేపు జీపీ వద్ద కూర్చోవడంతో సాక్షి కెమెరాకు చిక్కారు.


