వసతుల కల్పన.. అభివృద్ధి రూపకల్పన
దామెర: హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిల్వాయికి చెందిన గట్ల మల్లారెడ్డి సేవలు ఇప్పటికీ గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. 1984–90, 1996–2001 రెండు పర్యాయాలు సర్పంచ్‌గా సేవలందించారు. గ్రామంలో ప్రైమరీ, హై స్కూల్ నిర్మించారు. పలు గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, పైపులైన్, బస్‌షెల్టర్ నిర్మాణం, అంతర్గత రోడ్లు, వీఽధి దీపాల ఏర్పాటు వంటి ఎన్నో వసతులు కల్పించారు. ఆయన సేవలకు గుర్తుగా గ్రామంలోని కూడలిలో మల్లారెడ్డి ప్రతిమను ప్రతిష్ఠించారు. మల్లారెడ్డి కుమారుడు గట్ల విష్ణువర్ధన్‌రెడ్డి అమెరికా నుంచి వచ్చి 2018 నుంచి 2024 వరకు సర్పంచ్‌గా, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడిగా సేవలందించారు.


