పక్కాగా కోడ్ అమలు కావాలి
● జిల్లా ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్
జనగామ: గ్రామపంచాయతీ ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్ (ఐఎఫ్‌ఎస్) ఆదేశాలు జారీ చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలపై కలెక్టరేట్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్‌లతో కలిసి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ మాధురి షా, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
రైతుల ప్రయోజనానికే కొత్త విత్తన చట్టం
రైతుల ప్రయోజనాల కోసమే నూతన విత్తన చట్టం తీసుకొచ్చినట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రిజ్వాన్ బాషా అధ్యక్షతన నూతన విత్తన చట్టం–2025 ముసాయిదాపై అభిప్రాయ సేకరణ జరిగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మార్కెట్‌లో లభిస్తున్న విత్తనాల నాణ్యతను క్రమబద్ధీకరించడం, నకిలీ, నాసిరకం విత్తనాల అమ్మకాలను అరికట్టడం, రైతులు నష్టపోకుండా చూడ డం ఈ చట్టం బాధ్యత అన్నారు. సమీక్షలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఉమారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోని తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదాలను నివారించాలి..
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్, అధికారులు పాల్గొన్నారు.
టీ–పోల్ మొబైల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి
జనగామ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల సౌలభ్యం కోసం అందుబాటులోకి తెచ్చిన టీ పోల్ మొబైల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు.
నామినేషన్ల కేంద్రాల పరిశీలన
రఘునాథపల్లి: ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్, కలెక్టర్ రిజ్వాన్‌బాషా ఆదేశించారు. మండలంలోని నిడిగొండ, రఘునాథపల్లి నామినేషన్ కేంద్రాలను వారు పరిశీలించారు.


