వైజ్ఞానిక ప్రదర్శనకు సిద్ధం
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలో నిర్వహించబడుతున్న జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్ తెలిపారు. సైన్స్ ఫెయిర్‌కు 22 గదుల్లో 350కు పైగా ప్రదర్శన వస్తువులు సిద్ధం చేశామన్నారు. మనక్ ఇన్‌స్పైర్ ప్రదర్శనలకు ప్రత్యేకంగా 10 గదుల్లో 77 ప్రయోగాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులు, గైడ్ టీచర్లు సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను అదేశించారు. శాసీ్త్రయ దృక్పథాన్ని అభివృద్ధి చేయడంలో బాల వైజ్ఞానిక ప్రదర్శనలు కీలకమని సూచించారు. గురువారం సాన్ మారియా పాఠశాలలో ప్రదర్శనల నమోదు ప్రక్రియ చేపట్టారు.
22 గదుల్లో 350 వరకు ప్రదర్శనలు


