
సీజేఐపై దాడికి యత్నించిన వ్యక్తిపై చర్య తీసుకోవాలి
● ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో
కలెక్టరేట్ ఎదుట ధర్నా
జనగామ రూరల్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడికి యత్నించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ సునీల్ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రముఖ న్యాయవాది సాదిక్ అలీ, రాగళ్ల శ్రీహరి, గద్దల కిషోర్, సందేన రవీందర్, జేరిపోతుల సుధాకర్, బొట్ల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.