
కష్టపడిన వారికే ‘డీసీసీ’
జనగామ: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఐదేళ్లుగా కష్టపడి పనిచేసిన వారికే మాత్రమే డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులను స్వీకరించామని ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్ అన్నా రు. టీపీసీసీ ఆదేశాల మేరకు సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చివరిరోజు సోమవారం జనగామ మండలం పసరమడ్ల శివారు ఉషోదయ కన్వెన్షన్ హాల్‌లో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభిప్రాయ సేకరణలో టీపీసీసీ పరిశీలకులు ఎండీ అవేజ్, అరుణ్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం దేబాసిస్ పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పాలకుర్తి ఇన్‌చార్జ్ ఝాన్సీరెడ్డితో పాటు మొత్తంగా 30 మందికి దరఖాస్తులు చేసుకున్నారన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఇన్‌చార్జ్ సింగపురం ఇందిర మాత్రం తనతో ఫోన్‌లో మాట్లాడడం జరిగిందన్నారు. డీసీసీ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరితో ముఖాముఖి మాట్లాడడంతో పాటు 1500 మందికి పైగా సూచనలు వినడం జరిగిందన్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలో దస్వీకరించిన దరఖాస్తుల్లో ఆరింటిని మాత్రమే ఏఐసీసీకి పంపిస్తామన్నారు. అధినేత రాహుల్‌గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, సోని యాగాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ నేతృత్వంలో కొత్త డీసీసీని ఎన్నుకుంటారన్నారు.
ప్రత్యేక సమావేశం
డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న నాయకులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వ్యక్తిగత అభిప్రాయాలను సేకరించారు. జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణానికి అవసరమైన నాయకత్వ ఎంపికపై పరిశీలకులు సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్, డీసీసీగా అప్లికేషన్ చేసుకున్న వారితో పాటు నాయకులు వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, కంచె రాములు, ఎర్రమల్ల సుధాకర్, డాక్టర్ రాజమౌళి, ఆలేటి సిద్దిరాములు, జమాల్ షరీఫ్, ఉడుత రవి, చింతకింది మల్లేశం, కరుణాకర్‌రెడ్డి, బడికె ఇందిర, వంగాల కళ్యాణి, చెంచారపు బుచ్చిరెడ్డి, పిన్నంటి నారాయణరెడ్డి, గుండ శ్రీధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
అధ్యక్ష పదవి కోసం 30మంది దరఖాస్తు
దరఖాస్తు చేసుకున్నవారిలో కొమ్మూరి, ఝాన్సీరెడ్డి, ఇందిర
‘సంఘటన్ సృజన్ అభియాన్’లో ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్