న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
జనగామ: ఊహించకుండా వచ్చిన భారీ వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కల్లాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వేలాది ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. వరద నీరు మార్కెట్ ప్రాంగణంలోకి చేరి ధాన్యం చుట్టూ చేరడంతో పదుల సంఖ్యలో బస్తాలు కొట్టుకుపోయాయి. పైనుంచి వచ్చిన ప్రవాహం పెరగడంతో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయాయి. ప్రభుత్వ ఐకేపీ సెంటర్లను ప్రారంభించడంలో జాప్యం చేయడంతో రైతులకు భారీగా నష్టం తప్పలేదు. మద్దతు ధర కోసం ఆశపడి నిరీక్షిస్తే మొదటికే మోసం వచ్చేలా చేసింది.
ఆగమాగం..
జిల్లాలో సోమవారం తెల్లవారుజాము కురిసిన భారీ వర్షం రైతులను కోలుకోలేకుండా చేసింది. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ధాన్యం, మక్కలతో కాటన్ యార్డుతో పాటు కల్లాలు, కవర్ షెడ్‌లు పూర్తిగా నిండిపోయాయి. ప్రైవేటు కొనుగోళ్లు యథావిధిగా జరుగుతుండగా, ప్రభుత్వ సెంటర్ల ప్రారంభోత్సవంలో జాప్యం జరుగుతోంది. రైతులు తమ పంట ఉత్పత్తులకు మద్దతు ధర కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. సెంటర్లను ప్రారంభించడంలో జాప్యం చేయడంతో పాటు రైతులకు స్పష్టమైన సమాచారం ఇవ్వడంలో మా ర్కెట్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో తెల్లవారుజాము ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో కాటన్ యార్డులో ఉన్న ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. వరదకు పదుల సంఖ్యలో బస్తాలు కొట్టుకుపోగా, వేలాది బస్తాలు తడిసిపోయాయి. మార్కెట్ నుంచి ఇచ్చిన టార్పాలిన్ కవర్లన్నీ చిరిగిపోయి ఉండడంతో రైతులు స్వయంగా ఇంటి నుంచి తెచ్చుకున్న కవర్లను కప్పి కాపాడుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ధాన్యం రాశుల చుట్టూ వరద నీరు చేరడంతో.. నీటిని మళ్లించేందుకు రైతులు గంటల తరబడి కష్టపడ్డారు. పెద్దఎత్తున ధాన్యం బస్తాలు తడిసిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
నష్టం అంచనా వేయాలి..
మార్కెట్ కాటన్ యార్డులో కొట్టుకుపోయిన ధాన్యానికి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 30 బస్తాలకుపైగా కొట్టుకుపోగా, 2 వేల బస్తాలకు పైగా తడిసిపోయాయి. దీంతో నష్టం అంచనా వేయాల్సి ఉంది. నీటిలో తేలియాడే పంటతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తడిసిన సరుకును ఆరబెట్టినా మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అధికారులు దీనిని సీరియస్‌గా తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. పంట రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు.
భారీ వర్షంతో మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన ధాన్యం, మక్కలు
తడిసిన ముద్దయిన వేలాది బస్తాల ధాన్యం
వరదలోనే ధాన్యం రాశులు
కన్నీరు మున్నీరవుతున్న రైతులు
కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యమే కారణమంటూ ఆవేదన
వందల బస్తాలు తడిచాయి..
ఆరు రోజుల క్రితం మద్దతు ధరకు అమ్ముకునేందుకు 500 బస్తాల ధాన్యంతో మార్కెట్ కాటన్ యార్డుకు వచ్చాము. 10 బస్తాల ధాన్యం కొట్టుకుపోగా, 400బ్యాగులకు పైగా తడిసిపోయాయి. టార్పాలిన్ ఇంటి నుంచే తెచ్చుకున్నాం. మార్కెట్ సిబ్బంది ఇచ్చిన కవర్లు పనికి రావు. మళ్లీ ఆరబోసుకుంటున్నాం.
– గాజుల కట్టయ్య, రైతు, చౌడారం
ఆరేడు బస్తాలు కొట్టుకుపోయాయి..
ప్రభుత్వ సెంటర్ ప్రారంభిస్తారని చెబితే, 300 బస్తాల ధాన్యం తీసుకుని మార్కెట్ కాటన్ యార్డుకు ఐదు రోజుల క్రితమే వచ్చాము. నేటికీ సెంటర్ ప్రారంభం కాలేదు. అకాల వర్షంతో 60 బస్తాలకు పైగా తడిసిపోగా, ఆరేడు బస్తాలు కొట్టుకుపోయాయి.
–కూరాకుల శోభ, మహిళా రైతు, మరిగడి
ప్రభుత్వం ఆదుకోవాలి..
400 బస్తాల ధాన్యం మద్దతు ధరకు అమ్ముకునేందుకు మార్కెట్‌కు వచ్చా.. ఇందులో 300 బస్తాల వరకు తడిసిపోగా, 10 బస్తాల వరకు కొట్టుకుపోయాయి. ప్రభుత్వం నష్టపరిహారం అందించి మమ్మల్ని ఆదుకోవాలి.
–చెరుకూరి రాములు, రైతు, చౌడారం
ఆరుగాలం..వరదపాలు
ఆరుగాలం..వరదపాలు
ఆరుగాలం..వరదపాలు
ఆరుగాలం..వరదపాలు
ఆరుగాలం..వరదపాలు
ఆరుగాలం..వరదపాలు