
ప్రజాప్రభుత్వంలోనే రైతులకు మేలు
● ఏఎంసీలో ఐకేపీ సెంటర్లను ప్రారంభించిన చైర్మన్ శివరాజ్‌యాదవ్
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో చీటకోడూరు, శామీర్‌పేట గ్రామాలకు చెందిన రెండు ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ప్రారంభించారు. ‘ఆరుగాలం వరద పాలు–భారీ వర్షంతో మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన మక్కలు, ధాన్యం’ శీర్షికన సాక్షిలో ప్ర చురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం యార్డులో సెంటర్లను ప్రారంభించిన అనంతరం శివరాజ్ మాట్లాడారు.. వ్యవసాయ మార్కెట్ యార్డులో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు కోసం రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్, ఏడీఈ అపర్ణ, ఏపీఎం శంకరయ్య, ఏఎంసీ డైరెక్టర్లు నామాల శ్రీనివాస్, బొట్ల నర్సింగరావు, రమేశ్ యాదవ్, బండ కుమార్, రవీందర్, పర్ష సిద్దేశ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, రైతు నాయకులు చందూనాయక్ పాల్గొన్నారు.

ప్రజాప్రభుత్వంలోనే రైతులకు మేలు