
డిజిటల్ లిటరసీతో బోధన సులువు
● కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: విద్యారంగాన్ని మరింత బలో పేతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం అవసరమ ని అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు డిజిట ల్ విద్యపై అవగాహన పొందాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఏకశిల బీఈడీ కళాశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో డిజిటల్ లిటరసీపై ఫిజిక్స్ ఉపాధ్యాయులకు మూడు రోజులపా టు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.. మారుతున్న సమాజా నికి అనుగుణంగా విద్యా బోధన కూడా మారా ల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్ విద్యకు పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయని, పాఠశాలల్లో ఏ ర్పాటు చేసిన ఐఎఫ్‌బీ డిజిటల్ ప్యానెల్స్ కూడా విని యోగించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఏఎమ్‌ఓ శ్రీనివాస్, మాస్టర్ ట్రైనీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇందిరా మహిళా శక్తి
భవన నిర్మాణ పనుల పరిశీలన
మండలంలోని పెంబర్తి గ్రామం వద్ద రూ.5కోట్లతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో కలిసి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..నిర్మాణ పనులు వేగవంతంగా జరగాలని జాప్యం తగదన్నారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంజిత్ తదితరులు ఉన్నారు.