పాలకుర్తి టౌన్: పాలకుర్తి నియోజకవర్గంలోని గిరిజన తండాలు, గూడేలలో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.24.30 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్‌ను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కలిసి నియోజకవర్గ గిరిజన ప్రాంతాల అభివృద్ధి అంశాలపై ప్రతిపాదనలు అందజేశారు. బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.24.30 కోట్ల విలువైన ప్రభుత్వ జీఓ ఉత్తర్వులను మంత్రి లక్ష్మణ్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి అందజేశారు. గతంలో రూ.6కోట్లు కలిపి ఇప్పటివరకు రూ.30.30 కోట్ల నిధులను మంజూరు చేసినందుకు మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి మంజూరు జీఓ అందించిన మంత్రి అడ్లూరి