
మద్దతు ధరకే అమ్ముకోవాలి
● ధాన్యం పండించడంలో పంజాబ్‌ను మించుతున్న తెలంగాణ
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
బచ్చన్నపేట: వరి ధాన్యం పండించడంలో దేశంలో పంజాబ్‌ను తెలంగాణ మించుతోందని, ఆరుగాలాలు కష్టించి పనిచేసి పండించిన ధాన్యాన్ని అన్నదాతలు మద్దతు ధరకు అమ్ముకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలో ఐకేపీ, మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులను రాజు చేయడమే లక్ష్యంగా గత 9 సంవత్సరాలుగా కృషి చేస్తున్నామన్నారు. గత సంవత్సరంలో విక్రయించిన సన్న ధాన్యానికి ఇంకా బోనస్ డబ్బులను ఇవ్వలేదన్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఎక్కువగా అన్నదాతలు దొడ్డురకం వడ్లనే పండిస్తారని, వాటికి కూడా బోనస్‌ను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, తహసీల్దార్ రామానుజాచారి, ఏపీఎం రవి, సీఈఓ కాశ బాలస్వామి, నాయకులు పూర్ణచందర్, కొండి వెంకట్‌రెడ్డి, గంగం సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీహబ్ ప్రతినిధులతో జూమ్ మీటింగ్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ నుంచి వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం హైదరాబాద్‌లోని టీ హాబ్ ప్రతినిధులతో జూమ్‌మీటింగ్ నిర్వహించారు. టీహబ్, కెహబ్ ఎంఓయూలో భాగంగా పొందుపర్చాల్సిన అంశాలు, ఇరు పక్షాల బాధ్యతలు, విద్యార్థులకు అందించాల్సిన నైపుణ్యాల శిక్షణలు, వాటిలో భాగస్వాములు, వారి బాధ్యతలపై చర్చించారు.