
మెడికల్ కళాశాలలో మూడో బ్యాచ్ షురూ
జనగామ: జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మూడో బ్యాచ్ మొదటి సంవత్సరం తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి ఆధ్వర్యంలో హెచ్‌ఓడీల పర్యవేక్షణలో తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థుల సమక్షంలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.
97 మంది విద్యార్థులు హాజరు..
మెడికల్ కళాశాలలో 100 సీట్లకు అనుమతి లభించగా, ప్రస్తుతం రాష్ట్ర, జాతీయ కోటాలో 97 మంది విద్యార్థులు కౌన్సెలింగ్ ద్వారా చేరారు. ఇంకా 3 సీట్లు పెండింగ్‌లో ఉండగా, తదుపరి 3వ విడత కౌన్సెలింగ్‌లో ఆ స్థానాలు కూడా భర్తీ అయ్యే అవకాశముందని కళాశాల అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీహెచ్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, హెచ్‌ఓడీలు, డాక్టర్లు గోపాల్‌రావు, మధుసూన్‌రెడ్డి, అన్వర్, విశ్వనాథ్, శంకర్, పద్మిని, శకుంతల తదితరులు ఉన్నారు.