
అంబరాన్నంటిన జిల్లా ఆవిర్భావ వేడుకలు
జనగామ: జిల్లా ఆవిర్భవించి 10 ఏళ్ల వసంతంలోకి అడుగిడుతున్న వేళ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్‌ఎంఆర్ గార్డెన్‌లో సోషల్ వాయిస్ ఫౌండేషన్ ప్రతినిధి మంగళ్లపల్లి రాజు అధ్యక్షతన జరిగిన ఆవిర్భావ దినో త్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ య్య, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పసునూరి రవీందర్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. అంతకు ముందు ఆర్టీసీ చౌరస్తాలో జాతీయ జెండాను ఎగుర వేసి, ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రాజ య్య మాట్లాడుతూ జిల్లా కోసం ఘన్‌పూర్ ప్రజలు గొప్ప పోరాటం చేశారన్నారు. ఉద్యమకారులు డాక్టర్ రాజమౌళి, మేడ శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్, రెడ్డి రత్నాకర్‌రెడ్డి, జి.కృష్ణ, పెట్లోజు సో మేశ్వర్, పిట్టల సురేష్, మాజీద్, ఆలేటి సిద్ధిరాములు తదితరులను సత్కరించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ సమాజ మనుగడ సంస్కృతికి మూలాధారమన్నారు. జనగామ కవులు రచించిన వంద కవితల సాగుబాటు కవిత్వ సంకలనం ఆవి ష్కరించారు. రచయితలు, కవులు కళాకారులను సత్కరించి, జ్ఞాపికలను అందించారు. జరసం అధ్యక్షుడు నక్క సురేష్, మనోజ్ కుమార్ ఉన్నారు.