
రోజు వారీ నిర్వహణ ఎలా?
గ్రామాల్లో ప్రజాప్రతినిధి లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి న ఆర్థిక సంఘం నిధులను నిలిపివేసింది. పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి జరగడం లేదు. పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేస్తూ అత్యవసర పనులు చేయిస్తున్నారు. సర్కారు నుంచి రూపాయి రావడం లేదు. కనీసం చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్లలో డీజిల్ పోసేందుకు కూడా జీపీల్లో డబ్బులు లేవు.
– లకావత్ చిరంజీవి, స్టేషన్‌ఘన్‌పూర్
●
నారాయణపురం పంచాయతీకి రెండేళ్లుగా నిధులు రావడం లేదు. ఊరిలో కనీస వసతి సౌకర్యాలకు ఇప్పటి వరకు వీధిలైట్ల నిర్వహణ, డీజిల్, తాగునీటి పైపుల మరమ్మతు, బోరు మోటార్ల రిపేరు తదితర వాటి కోసం రూ.1.50 లక్షల వరకు సొంతంగా ఖర్చు చేశా.
– దేవి ప్రసాద్,
పంచాయతీ కార్యదర్శి, బచ్చన్నపేట

రోజు వారీ నిర్వహణ ఎలా?