
‘ధన్ ధాన్య కృషి యోజన’తో ఒరిగేదేమి లేదు
జనగామ రూరల్: పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకంతో రైతులకు ఒరిగేదేమిలేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం పీఎం చేతుల మీదుగా వర్చువల్ విధానంలో పథకం ప్రారంభం కాగా ఎమ్మెల్యే వీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ రెండు పథకాలతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశారు. కొత్తగా ఏ పథకం తీసుకురాకుండా ఇప్పటికే ఉన్న పథకాల నిధులను కలిపి చూపిస్తున్నారని విమర్శించారు. కిసాన్ యోజన పేరుతో ఇప్పటివరకు రూ. 3 లక్షల కోట్లను ఇచ్చామని కేంద్రం చెబుతున్నా.. వాస్తవంగా రైతుల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. 72 లక్షల మంది రైతులకు రూ.72 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి