మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Oct 12 2025 7:16 AM | Updated on Oct 12 2025 7:16 AM

మత్తు

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

హెచ్‌సీఎల్‌ టెక్‌ బీ ఉద్యోగ మేళా

జనగామ రూరల్‌: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డీసీపీ రాజమహేంద్రనాయక్‌ అన్నారు. పట్టణంలోని వీవర్స్‌ కాలనీ హనుమాన్‌ దేవాలయం వద్ద శనివారం డీసీపీ రాజమహేంద్రనాయక్‌ ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ డ్రగ్స్‌ వా డకం శరీరాన్ని, మనసును నశింపజేస్తుందని, కుటుంబాలను దెబ్బతీస్తుందని, సమాజాన్ని కలుషితం చేస్తుందన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని, పోలీస్‌ శాఖతో సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పండేరి చేతన్‌ నితిన్‌, సీఐ సత్యనారాయణ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

ఆటోలోనే ప్రసవం

లింగాలఘణపురం: మండల కేంద్రానికి చెందిన మర్రికుక్కల కనకలక్ష్మి శనివారం పురిటినొప్పులతో బాధపడుతూ 108 ఆలస్యం అవుతుందని చెప్పడంతో ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సుఖప్రసవం జరిగి పడ్డంటి మగబిడ్డకు జన్మని చ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కనకలక్ష్మికి శనివారం సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో పురిటినొప్పులు రావడంతో స్థానికంగా ఉన్న 108కు ఫోన్‌ చేశారు. మరో కేసు నిమిత్తం ఆలస్యం అవుతుందని చెప్పడంతో స్థానికంగా ఉన్న శ్రీశైలం ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్తుతున్నారు. నెల్లుట్ల వద్దకు చేరుకోగానే ఆటోలోనే సుఖప్రసవం జరిగింది. భర్త ఉపేందర్‌ ఒక్కడే తోడుగా ఉండి ఆందోళన పడగా స్థానిక మహిళలు స్పందించి సహాయం చేశారు. కొద్దిసేపటికి దేవరుప్పుల నుంచి 108 రావడంతో తల్లీబిడ్డలను క్షేమంగా జనగామ ఎంసీహెచ్‌కు తరలించారు.

బంద్‌కు సహకరించాలి

జనగామ రూరల్‌:బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ జిల్లా బీసీ సంక్షేమ యువజన విభాగం ఆ ద్వర్యంలో ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు మద్దతు తెలుపుతున్నామని, బంద్‌కు ప్రతి ఒక్క రు సహకరించాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు పండుగ హరీశ్‌ శనివారం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర బీసీ కార్యాలయంలో కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ హక్కులు, రిజర్వేషన్ల రక్షణ కోసం అన్ని బీసీ సంఘాలు, నాయకులు, యు వత ఒక్కటై మిలియన్‌ మార్చ్‌ తరహాలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. బంద్‌కు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోరారు.

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా కేంద్రంలో ఇంటర్‌ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వారు ఈనెల 13న సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డీఐఈఓ ఎ.గోపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌సీఎల్‌ టెక్‌బీ ప్రోగ్రామ్‌ కోసం 2024–25లో ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, బీపీసీ ఓకేషనల్‌ కంప్యూటర్స్‌ విద్యార్థులకు ఈనెల 13న ఉదయం10 గంటలకు హనుమకొండలోని అంబేడ్కర్‌ సెంటర్‌ సమీపంలోని ఐసీఎస్‌ఎస్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌లో మెగా జాబ్‌ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల అన్ని గ్రూపుల విద్యార్థులు 75 శాతం ఓవరాల్‌గా, 60 శాతం మార్కులు గణితంలో పొందిన విద్యార్థులు జాబ్‌మేళాకు అర్హులని పేర్కొన్నారు. టెన్త్‌, ఇంటర్‌ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు జిరాక్స్‌ కాపీ, ఫొటో, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్‌తో జాబ్‌మేళా నిర్వహించే కేంద్రానికి హాజరుకావాలని ఆయన కోరారు.

కేయూ ఎంటెక్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో ఎంటెక్‌ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ (రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంటు) పరీక్షలు ఈనెల 16వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఆసిం ఇక్బాల్‌ తెలిపారు. ఈ నెల 16, 18, 22, 24, 27, 29 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు ఉంటాయని, విద్యార్థులు సకాలంలో హాజరుకావాలని కోరారు.

మత్తు పదార్థాలకు  దూరంగా ఉండాలి1
1/1

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement