
అందరి అభిప్రాయం మేరకు డీసీసీ ఎన్నిక
జనగామ: పార్టీలోని అందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే డీసీసీ ఎన్నిక ఉంటుందని టీపీసీసీ అబ్జర్వర్, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య అన్నారు. డీసీసీ ఎన్నిక కసరత్తు నేపధ్యంలో శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కొ మ్మూరి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన దరఖాస్తుల స్వీకరణలో ఏఐసీసీ అబ్జర్వర్ దేబాసిస్ పట్నాయక్, టీపీసీసీ అబ్జర్వర్లు శంకరయ్య, ఎండీ ఆవేజ్, శ్రీకాంత్‌యాదవ్, జువ్వాడి ఇంద్ర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే శంకరయ్య మాట్లాడుతూ పార్టీకి, కార్యకర్తలకు అందుబాటులో ఉండే వారిని డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. గతంలో మాదిరిగా కాంగ్రెస్ మండల, జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయడం లేదన్నారు. పార్టీలో ఎవరైన డీసీసీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను రహస్యంగా సేకరిస్తామన్నారు. డీసీసీ గా సమర్థులు ఎవరనే తుది నిర్ణయం, స్వేచ్ఛ కార్యకర్తలపైనే ఉంటుందన్నారు. ఏఐసీసీ అబ్జర్వర్ దేబా సిస్ పట్నాయక్ మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త అభిప్రాయం మేరకే డీసీసీ ఎన్నిక ఉంటుందన్నారు. నే టి (ఆదివారం) జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో కార్యకర్తల అభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. దరఖాస్తుల స్వీకరణ, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, ఈ నెల 13న సమర్థులను డీసీసీగా ఎన్నుకునేందుకు పీసీసీకి సమగ్ర సమాచారం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యా దవ్, పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాంబాబు, నాయకులు కరుణాకర్‌రెడ్డి, వంగాల మల్లారెడ్డి, నల్లగోని బాలకిషన్ గౌడ్, జంగిటి విద్యానాధ్ తదితరులు ఉన్నారు. కాగా అంతకు ముందు డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తన దరఖాస్తును అబ్జర్వర్లకు అందించారు.
డీసీసీ అధ్యక్షుడి కోసం దరఖాస్తు
జనగామ డీసీసీ అధ్యక్షుడి కోసం ఆ పార్టీ నాయకుడు నాగపురి కిరణ్‌కుమార్ శనివారం జనగామకు వచ్చిన ఏఐసీసీ అబ్జర్వర్ పట్నాయక్, టీపీసీసీ అబ్జర్వర్, షాద్‌నగర్ ఎమ్మె ల్యే ఈర్ల శంకర్, శ్రీకాంత్ యాదవ్, హఫీజ్‌ను కలిసి నాయకులు, కార్యకర్తలతో కలిసి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ జనగామ డీసీసీ అధ్యక్షుడిగా బీసీ నాయకుడిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.
టీపీసీసీ అబ్జర్వర్, షాద్‌నగర్ ఎమ్మెల్యే
శంకరయ్య