‘పచ్చని’ వాతావరణం.. స్వచ్ఛమైన గాలి
జనగామ: ‘పచ్చని వాతావరణంలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుందాం.. పర్యావరణ పరిరక్షణకు ఉద్యమంలా కదులుదాం.. రేపటి భవిష్యత్ కోసం ప్రకృతిని కాపాడుకుందాం’ అంటూ పర్యావరణ ప్రేమికులు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. మట్టిని నాశనం చేస్తూ, ప్రమాదకరమైన ప్లాస్టిక్‌తో ప్రయాణిస్తూ వాతావరణ కాలుష్యానికి కారకులవుతున్న మానవ సమాజాన్ని మేల్కొలుపుతున్నా.. ఇంకా నిద్ర మత్తులోనే జోగుతున్నారు. నేడు(గురువారం) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
పర్యావరణంపై మానవుడి దాడి
ప్రకృతి ఒడిలో పంచభూతాలు ప్రాణకోటి జీవజాతికి ఆధారం. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్య వంతమైన జీవనం వీటితోనే సాధ్యం. ప్రకృతితో పెనవేసుకున్న మానవుడి జీవితం ప్రమాదంలో ఉంది. చెరువులు, వాగులు, పచ్చని కొండలు కనుమరుగవుతున్నాయి. మానవులు పర్యావరణంపై చేస్తున్న ఈ దాడితో వాయు, నీటి కాలుష్యంతోపాటు పుడమిపై తీవ్ర ప్రభావం పడుతోంది. రోజురోజుకూ విస్తరిస్తున్న మహా నగరాలు, పట్టణాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి ఆకుపచ్చని అడవులు కాంక్రీట్ వనాలుగా మారుతున్నాయి. 5.28 లక్షల ఎకరా ల విస్తీర్ణం కలిగి ఉన్న జనగామ జిల్లాలో అటవీ ప్రాంతం కేవలం 7,265 ఎకరాలు మాత్రమే. ఒక శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 3 నుంచి 5 శాతానికి పెంచేందుకు 11 ఏళ్లుగా కోట్లాది రూపాయలు ఖచ్చు చేస్తున్నా ఇప్పటికీ 0.05 శాతం అడవిని మాత్రమే పెంచగలిగారు.
అంతరిస్తున్న అటవీ ప్రాంతం
జిల్లాలో 1985 నుంచి 2018 వరకు కలప అక్రమ రవాణా జోరుగా సాగింది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో చెట్లను నరికి కర్రను జిల్లా దాటించేస్తున్నారు. రోడ్ల విస్తరణ పేరిట మహా వృక్షాలను తొలగించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సాగు పెరిగింది. దీంతో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న చెట్లను తొలగించడంతో జిల్లా ఎడారిగా మారింది. దీనికి తోడు రియలెస్టేట్ వెంచర్ల పేరిట పచ్చని చెట్లను నరికి పర్యావరణా నికి చేటు చేస్తున్నారు. మానవునికి నేలతో ఉన్న సంబంధాన్ని గుర్తెరిగి పర్యావరణాన్ని కాపాడుకుంటే అందరికీ మంచిది.
నేడు ప్రపంచ పర్యావరణ
దినోత్సవం
భూమిపై మళ్లీ పుట్టే అవకాశం వస్తే..
భూమిపై మళ్లీ పుట్టే అవకాశం వస్తే ప్రకృతిలో ఏ రూపంలో పుట్టాలనుకుంటున్నారు. కొద్ది సేపు మౌనంగా ఉండి ఆలోచిస్తే సమాధానం లభిస్తుంది. మీరు పుట్టాలనుకునే రూపం ఈ భూమిని మీరు ఎంతగా ప్రేమిస్తారో చెబుతుంది. అప్పుడే పర్యావరణ పరిక్షణ అంటే ఏమిటో తెలుసుకోగలుగుతాం.
– ఎండీ.గౌసియా బేగం, టీజీ నేషనల్ గ్రీన్ క్రాప్స్
● ప్లాస్టిక్‌కు గుడ్‌బై చెబుదాం
● మట్టిలో కలిసి పోయే శ్రేష్టమైన బ్యాగులు వాడుదాం
● ఇంటిముందు నీటి పాత్ర పెట్టి పక్షులను కాపాడుదాం
● మొక్క నాటి పేరుపెట్టి మిత్రుడిగా
చూసుకుందాం
● అది మన జీవన గమనంలో
మైలురాయి అవుతుంది
● పిల్లలు, మనువలకు నీడ నిస్తుంది
●
ఇలా చేద్దాం..
భవిష్యత్ తరాలకు అందిద్దాం
ఇన్‌స్టంట్ వ్యవసాయం, ప్లాస్టిక్
పర్యావరణానికి ముప్పు
కనుమరుగవుతున్న చెరువులు, వాగులు, పచ్చని కొండలు
వాటిని కాపాడుకుంటేనే మానవుల మనుగడ
5.28 లక్షల ఎకరాల విస్తీర్ణంలో జిల్లా.. అటవీ ప్రాంతం ఉన్నది ఒక్క శాతమే
‘పచ్చని’ వాతావరణం.. స్వచ్ఛమైన గాలి
‘పచ్చని’ వాతావరణం.. స్వచ్ఛమైన గాలి


