క్రిస్మస్‌ శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ శుభాకాంక్షలు

Dec 25 2024 2:23 AM | Updated on Dec 26 2024 8:38 AM

క్రిస

క్రిస్మస్‌ శుభాకాంక్షలు

డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి

జనగామ: క్రిస్మస్‌ పండను పురస్కరించుకుని డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి క్రిస్టియన్‌ సోదరీ, సోదరిమణులకు శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తును ఆరాధించే ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దైవ కుమారుడు మానవునిగా జన్మించిన యేసుప్రభువు జీవనం మనందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఏసుభువు తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా మార్గనిర్దేశం చేశారన్నారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం, ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి అందించిన మహోన్నత కరుణామయుడని అన్నారు.

ప్రశాంతంగా న్యూయర్‌ వేడుకలను జరుపుకోవాలి

బచ్చన్నపేట: నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని నర్మెట సీఐ అబ్బయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఆయన మాట్లాడారు. డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి మద్యం సేవించి వాహనాలను నడపరాదని, ఇతరులకు ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు. అలాగే డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేయొద్దన్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎస్సై హమీద్‌, కానిస్టేబుళ్లు ఉన్నారు.

సన్మానం

జనగామ రూరల్‌: ఇటీవల జిల్లా కోర్టులో ఏజీపీగా నియమితులైన ఎనగందుల చంద్రరుషిని మంగళవారం తెలంగాణ దివ్యాంగుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పంతులు ప్రభాకర్‌ మర్యాదపూర్యకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించారు. దివ్యాంగులకు న్యాయపరమైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు.

రాష్ట్ర పద్మశాలి సంఘం

సంయుక్త కార్యదర్శికి..

బచ్చన్నపేట: ఇటీవల తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సంయుక్త కార్యదర్శిగా ఎన్నికై న మండల కేంద్రానికి చెందిన గుర్రపు బాలరాజును పలువురు కాంగ్రెస్‌ మండల నాయకులు మండల కేంద్రంలోని పద్మశాలి భవన్‌లో మంగళవారం సన్మానించారు. విద్యానాథ్‌, పిన్నింటి నారాయణరెడ్డి, రాజిరెడ్డి. నరేష్‌, మహబూబ్‌, రాములు, అంజనేయులు ఉన్నారు.

పశు వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

జఫర్‌గఢ్‌: పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో నిర్వహిస్తున్న పశు వైద్యశిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉప్పుగల్లు పశువైద్యాధికారి కాకుమాను శ్రీనాఽథ్‌ కోరారు. మండలంలోని తిడుగు గ్రామంలో మంగళవారం నిర్వహించిన పశు వైద్యశిబిరంలో ఆయన మాట్లాడారు. గోపాలమిత్ర సూపర్‌ వైజర్‌ రాజేశ్వర్‌రావు, గోపాలమిత్రలు చిలువేరు నాగేష్‌, కత్తుల లచ్చయ్య, గుజ్జరి రాజు, దివ్య రైతులు పాల్గొన్నారు.

ప్రమాదవశాత్తు

పొక్లెయినర్‌ వైరింగ్‌ దగ్ధం

బచ్చన్నపేట: ప్రమాదవశాత్తు పొక్లెయినర్‌ వైరింగ్‌ దగ్ధమైన ఘటన మండలంలోని కేసిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. పొక్లెయినర్‌ యజమాని ఆరె రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... రోజు మాదిరిగా పొక్లెయినర్‌ని పార్కింగ్‌ చేయగా సోమవారం అందులో నుంచి పొగలు వస్తుండగా వెళ్లి చూశాడు. అప్పటికే అందులోని వైరింగ్‌ పూర్తిగా దగ్ధమైంది. ఆయిల్‌ కూడా పోయింది. దాదాపు రూ. 4 లక్షల నష్టం వాటిళ్లిందని, ఈ విషయమై మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

దుప్పట్ల పంపిణీ

పాలకుర్తి: సిరిసన్నగూడెంలో నక్క జైప్రకాశ్‌ ఆధ్వర్యంలో పేదలకు శుక్రవారం దుప్పట్లు పంపిణీ చేసి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోజెస్‌ బాబు నిర్వహించిన జానపద కళాప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. క్రిస్మస్‌ ఫెయిత్‌ క్రైస్టు టెంపుల్‌ పాస్టర్‌ రక్షిత ఇవాంజెలియన్‌, మహేందర్‌, సౌందర్య దిలీప్‌, కిరణ్‌ వెంకట్‌,చంద్రయ్య, సుగుణ పాల్గొన్నారు.

నైతిక విలువలు

పెంపొందించుకోవాలి

జనగామ రూరల్‌: విద్యార్థులు నైతిక విలువలను పెంపొందించుకోవాలని హెచ్‌ఎం జి.నాగరాణి అన్నారు. ఫీల్డ్‌ ట్రిప్‌లో భాగంగా మంగళవారం పెంబర్తి ఉన్నత పాఠశాల విద్యార్థులను రాజరాజేశ్వరీ వృద్ధాశ్రమానికి తీసుకెల్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయత, కరుణ, జాలి, దయ చిన్ననాటి నుంచే కలిగి ఉండాలన్నారు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో విడిచిపెట్టొదన్నారు. ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఆర్‌.వెంకటేశ్వర్లు, సుభాష్‌, ఉమాదేవి, వసంత పాల్గొన్నారు.

క్రిస్మస్‌ శుభాకాంక్షలు
1
1/1

క్రిస్మస్‌ శుభాకాంక్షలు

Advertisement
 
Advertisement
Advertisement